Telugu Updates

పాతికేళ్ల విరామం.. చెరగని స్నేహం!

– ఘనంగా జెడ్పీహెచ్ఎస్ చౌటుప్పల్ 1999-2000 బ్యాచ్ సమ్మేళనం

– గురువులకు ఘన సన్మానం

Post Midle

చౌటుప్పల్, తొలివెలుగు: పాతికేళ్ల నాటి జ్ఞాపకాలు ఆ ప్రాంగణంలో మళ్లీ చిగురించాయి. చౌటుప్పల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదవ తరగతి 1999-2000 విద్యాసంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానికంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పటి ఉపాధ్యాయులు బి. నర్సింహ రెడ్డి, ఎం. నర్సింహారావు, ఆర్. సతి రెడ్డి, ఎన్. కుమార స్వామి, కె. విజయలక్ష్మి, కె. రఘుమా రెడ్డి, టి. పాండు రంగ విట్టల్, పి. ప్రసాద్ రావు, టి. రామారావు, బి. ధనంజయయ్య హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. శిష్యులంతా కలిసి తమ గురువులను శాలువాలు, స్మారక చిహ్నాలతో ఘనంగా సన్మానించారు. మెండే మల్లేశం, బైరు నరేష్, సుర్వి సురేష్, కూరేళ్ళ పాండు, ఉడుగు కల్పన, అందే అరుణ, మరుపాక నీరజ, దొనూరి జ్యోతి, చెరుకు లింగమ్మ, రాచకొండ సంతోష తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ చిన్ననాటి ముచ్చట్లను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Post bottom
Post bottom