– నల్గొండ ఆర్.ఎమ్ కు సర్పంచుల విన్నపం
సంస్థాన్ నారాయణపురం, తొలివెలుగు: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం నుంచి కంకణాలగూడెం, శేరిగూడెం, చిమిర్యాల మీదుగా చౌటుప్పల్ వరకు కొత్త బస్సు సౌకర్యం కల్పించాలని నల్గొండ బస్సు డిపో ఆర్.ఎమ్ ను సర్పంచులు కోరారు. సోమవారం కంకణాలగూడెం సర్పంచ్ పాలెం వీరేష్ గౌడ్, చిమిర్యాల సర్పంచ్ ఉప్పల రమేష్ గౌడ్ కలిసి ఆర్.ఎమ్, డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పై గ్రామాల ప్రజలు విద్య, ఉపాధి, వైద్య అవసరాల కోసం చౌటుప్పల్‌కు ప్రయాణించాల్సి వస్తోందని, సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ మార్గంలో బస్సు సర్వీసు ప్రారంభిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. వినతిని పరిశీలించిన ఆర్ఎం, డీఎం సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కంకణాలగూడెం వార్డు మెంబర్ రాచకొండ గిరిబాబు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కర్తల కిషన్, ముడుపు రంగారెడ్డి, చిమిర్యాల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
