Telugu Updates

తీరిన నీటి కష్టాలు.. అండగా నిలిచిన ఇఎల్‌వి ఫౌండేషన్

– పేదల సేవకే ఇఎల్‌వి భాస్కర్ ఫౌండేషన్ ప్రాధాన్యం

– మల్లికార్జున నగర్‌లో బోరుబావి పనులు ప్రారంభం

– ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్

Post Midle

చౌటుప్పల్,  తొలివెలుగు :  పేద ప్రజల అవసరాలను గుర్తించి వారికి సహాయం అందించడమే ఇఎల్‌వి భాస్కర్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ డైరెక్టర్ ఇరగదిండ్ల అశోక్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో మందుల కుల సంక్షేమ సంఘం విన్నపం మేరకు సోమవారం బోరుబావి పనులను ప్రారంభించారు. ఫౌండేషన్ చైర్మన్ ఇఎల్‌వి భాస్కర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ అశోక్ పూజా కార్యక్రమాలు నిర్వహించి బోరు బావి తవ్వకాలకు శంకుస్థాపన చేశారు. కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యపై తక్షణమే స్పందించి బోరుబావి ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలకు ఊరట లభించింది. ఈ సందర్భంగా మందుల కుల సంక్షేమ సంఘం నాయకులు, స్థానికులు ఇఎల్‌వి భాస్కర్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న ఫౌండేషన్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అశోక్ మాట్లాడుతూ.. కాలనీ సమగ్ర అభివృద్ధికి భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ తరపున తమ వంతు సహకారం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

Post bottom
Post bottom