– వలిగొండ ఎక్స్ రోడ్డులో ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు
– ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్
చౌటుప్పల్, (తొలివెలుగు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వలిగొండ ఎక్స్ రోడ్డులో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాహనదారులకు రోడ్డు నిబంధనలపై దిశానిర్దేశం చేశారు.

టూ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాల బారిన పడటమే కాకుండా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.
