Telugu Updates

పబ్బు రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

చౌటుప్పల్, (తొలివెలుగు): కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్ జన్మదిన వేడుకలు చౌటుప్పల్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ధర్మోజిగూడెం గ్రామ సర్పంచ్ జువ్వి నర్సింహ్మ పబ్బు రాజు గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పండ్ల బొకేను అందజేశారు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు శారద లింగస్వామి, రాచకొండ భార్గవ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, మాజీ ఉపసర్పంచ్ కొంత బుచ్చిరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Midle
Post bottom
Post bottom