వలిగొండ, తొలివెలుగు: తెలంగాణ గురుకుల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ (టీజీపీఏ) సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా వలిగొండ పట్టణానికి చెందిన ఫైళ్ల ప్రకాశ్ రెడ్డి ఎన్నికయ్యారు. గురుకుల విద్యా వ్యవస్థపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, గతంలో వివిధ స్థాయిల్లో అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతాయుత పదవిని ఆయనకు అప్పగించినట్లు సంఘ నాయకులు తెలిపారు. ప్రిన్సిపల్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రకాశ్ రెడ్డి నిరంతరం కృషి చేస్తారని పలువురు విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వలిగొండ గ్రామానికి చెందిన విద్యా అభిమానులు, మిత్రులు కాసుల వెంకన్న, పబ్బు వెంకటరమణ, గరిసె రవి, పాలకూర వెంకటేశం, గంగాధర్ దయాకర్, నూతనగంటి వెంకటేశం, బెలిదే శ్రీనివాస్ తదితరులు ఫైళ్ల ప్రకాశ్ రెడ్డిని కలిసి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
