Telugu Updates

సంపూర్ణ మద్యపాన నిషేధం

• ముద్దాపురం గ్రామంలో మద్యపాన నిషేధానికి గ్రామ ప్రజల తీర్మానం

వలిగొండ, తొలివెలుగు : వలిగొండ మండలంలోని ముద్దాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం తీసుకున్నారు. 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో గ్రామంలో బెల్టు షాపులు, హోటళ్లు ద్వారా మద్యం విక్రయం పూర్తిగా నిషేధించాలనీ నిర్ణయించారు.

Post Midle

తీర్మానం ఉల్లంఘించినట్లయితే రూ.50,000 జరిమానా విధిస్తామని గ్రామ ప్రజలు వెల్లడించారు. మద్యపానం కారణంగా గ్రామంలో అనేక సమస్యలు, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటికి చెక్ పెట్టే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో సర్పంచ్ సామ సరస్వతి రాంరెడ్డి, ఉపసర్పంచ్ బడక శ్రీనివాస్, వార్డు సభ్యులు గూడూరు సుగుణమ్మ, సామ రాజేందర్ రెడ్డి, సామల చైతన్య, బత్తుల భిక్షం, వాకిటి కొండల్ రెడ్డి, జక్క వెంకట్ రెడ్డి, సామ రాంరెడ్డి, గుర్రం కిష్టారెడ్డి, యం నవీన్, సునీత, పద్మ, బుచ్చమ్మ, పూలమ్మ, ఎస్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Post bottom
Post bottom