గాంధీజీ మార్గం అనుసరణీయం
– ట్రినిటీ హైస్కూల్‌లో ఘనంగా బాపూజీ వర్ధంతి వేడుకలు
– అహింసా సిద్ధాంతం ప్రపంచానికే మార్గదర్శకం: వెన్‌రెడ్డి సంధ్య రాజు

చౌటుప్పల్, తొలివెలుగు :
చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్‌లో మహాత్మా గాంధీ వర్ధంతిని శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాంధీ గ్లోబల్ చైర్మన్ వెన్‌రెడ్డి సంధ్య రాజు మాట్లాడుతూ.. బాపూజీ అహింసా సిద్ధాంతం ప్రపంచానికే మార్గదర్శకమని పేర్కొన్నారు. సత్యం, అహింస, సేవా భావం వంటి విలువలను విద్యార్థులు చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని సూచించారు.
పాఠశాల డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల మాట్లాడుతూ.. గాంధీజీ బోధనలు ప్రతి విద్యార్థి జీవితంలో వెలుగు నింపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది నవ్య, శ్రీదేవి, సునీత, కొండమ్మతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
