Telugu Updates

చౌటుప్పల్‌లో ముగిసిన నామినేషన్ల పర్వం 

– మొత్తం 191 నామినేషన్ సెట్లు దాఖలు

– అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 65

చౌటుప్పల్‌, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల తొలి ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు గాను మూడు రోజుల వ్యవధిలో మొత్తం 191 నామినేషన్ సెట్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామ్ రెడ్డి తెలిపారు.

Post Midle

చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 67 మంది అభ్యర్థులు 126 నామినేషన్ సెట్లను సమర్పించారని ఆయన వెల్లడించారు. పార్టీల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 65 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి 50, బీజేపీ నుంచి 41 నామినేషన్లు వచ్చాయి.

అదేవిధంగా సీపీఐ(ఎం) నుంచి 10, ఇతర పార్టీల నుంచి 11, స్వతంత్ర అభ్యర్థులుగా 14 మంది నామినేషన్ సెట్లు దాఖలు చేశారు.

నామినేషన్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరామ్ రెడ్డి తెలిపారు.

Post bottom
Post bottom