- అల్లాపురంలో ఘనంగా చీరల పంపిణీ
- అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంజుల దిలీప్ రెడ్డి

చౌటుప్పల్, తొలివెలుగు : మహిళల సంక్షేమం, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ’ చీరల పంపిణీ కార్యక్రమం అల్లాపురం గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ మండల పరిధిలోని అల్లాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేకుల మంజుల దిలీప్ రెడ్డి పాల్గొని, లబ్ధిదారులకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల ప్రత్యేక గౌరవంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని కొనియాడారు. గ్రామంలోని అర్హులైన మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ కానుక మహిళల ముఖాల్లో చిరునవ్వులు నింపుతోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు భూతం లింగస్వామి, యంజాల లింగస్వామి, సామ సుమిత్ర, గ్రామ కార్యదర్శి రజిత, వీఓ యంజాల రేణ, గ్రామ ప్రజలు, మహిళలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
