– కోటి మందిని కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
– మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
– చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ. 34 కోట్లకు పైగా రుణాల పంపిణీ
– స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: కమిషనర్ వెంకట్రాంరెడ్డి

తొలివెలుగు, చౌటుప్పల్ : మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తోందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తెలిపారు. సోమవారం చౌటుప్పల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో బి.ఆర్.కె ఫంక్షన్ హాల్‌లో స్వయం సహాయక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు.

మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో 591 సంఘాలకు రూ.1.28 కోట్ల వడ్డీ లేని రుణాలు, 451 సంఘాలకు వివిధ బ్యాంకుల ద్వారా రూ.33.25 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ నిధులతో మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్.ఓ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
