Telugu Updates

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

 

– అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

చౌటుప్పల్, తొలివెలుగు : జిల్లాలోని మైనార్టీ నివాస పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్‌ను స్థానిక సంస్థలు, రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శనివారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.

Post Midle

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్య, వసతులను ముస్లిం మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిల్లో అందుబాటులో ఉన్న సీట్లను పూర్తిగా భర్తీ చేసుకునేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు.

మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన విద్యార్థులు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ), డీఎండబ్ల్యూఓ జయమ్మ, ఆర్‌సీఓ శ్రీకాంత్, ఉర్దూ మైనార్టీ అధికారి ఫౌజియా, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ప్రిన్సిపాళ్లు బాలకృష్ణ, శ్రీనివాస్, కవిత తదితరులు పాల్గొన్నారు.

Post bottom
Post bottom