Telugu Updates

ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమాల రద్దు

 

– జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు

Post Midle

యాదాద్రి భువనగిరి, తొలివెలుగు : 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను 27 జనవరి 2026న విడుదల చేసిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం, ఉద్యోగవాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

Post bottom
Post bottom