Telugu Updates

సేవలకు గుర్తింపు: ఏఈ సతీష్‌కు జిల్లా స్థాయి అవార్డు

– యాదవ సంఘ నేతల ఘన సన్మానం

చౌటుప్పల్, తొలివెలుగు : విద్యుత్ రంగంలో విశేష సేవలు అందించి జిల్లా స్థాయి ఉత్తమ అధికారి పురస్కారం పొందిన చౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్ యాదవ్‌ను యాదవ సంఘం నేతలు శనివారం ఘనంగా సన్మానించారు.

Post Midle

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ చేతుల మీదుగా సతీష్ కుమార్ యాదవ్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల, పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు.

మండల అధ్యక్షుడు చినుకని మల్లేశం యాదవ్ మాట్లాడుతూ.. సతీష్ కుమార్ తన విధుల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి అవార్డు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం ఏఈ సతీష్ కుమార్ యాదవ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గుండెబోయిన అయోధ్య యాదవ్, చిలకల శ్రీనివాస్ యాదవ్, నల్ల పర్వతాలు యాదవ్, గంగనబోయిన వెంకటేష్ యాదవ్, గజ్జి పాండు యాదవ్, నల్ల గణేష్ యాదవ్, ఆవుల ఏసు యాదవ్, ఆవుల మల్లయ్య యాదవ్, గుండెబోయిన వేణు యాదవ్, గుణమోని లింగస్వామి యాదవ్, గుణమోని బాలకృష్ణ యాదవ్, బద్దుల సుధాకర్ యాదవ్, మెండే మల్లేష్ యాదవ్, ఎం. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post bottom
Post bottom