Telugu Updates

విపక్షాలకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి క్యూ!

– బీజేపీ, బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు

– చౌటుప్పల్‌లో హస్తం హవా.. ఆహ్వానించిన బి.ఎన్. రెడ్డి

చౌటుప్పల్, తొలివెలుగు : 

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వలసల జోరు కొనసాగుతోంది. లింగోజిగూడెం గ్రామానికి చెందిన బీజేపీ నేతలు పిల్ల బాబు, సుమిత్ర, శంకరమ్మలతో పాటు, బీఆర్‌ఎస్ నాయకులు అన్వాసిపేట లింగస్వామి, అనిల్, మౌనిక, దర్శనం వెంకటేష్‌లు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయంగా కీలక పరిణామానికి నాంది పలికారు.

Post Midle

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బి.ఎన్. రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన నేతలకు పార్టీ కండువలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేరిన నేతలు… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. అదే విశ్వాసంతో తాము కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు.

నూతన సభ్యులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని కూడా తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని చెందిన ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్తగా చేరిన నేతలకు ఘన స్వాగతం పలికారు. ఈ చేరికలతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.

Post bottom
Post bottom