– బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
– బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్
– నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
చౌటుప్పల్, తొలివెలుగు: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సర్పంచులు, ఉప సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, సమర్థవంతంగా పనిచేస్తే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, రైతు నాయకులు ముప్పడి పురుషోత్తం గౌడ్, మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
