Telugu Updates

జాతీయ స్థాయి క్రీడలకు పులిగిల్ల విద్యార్థి ఎంపిక

– అభినందించిన ఉపాధ్యాయులు

తొలివెలుగు, వలిగొండ : తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన 5వ సౌత్ జోన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున పాల్గొన్న జడ్పీహెచ్‌ఎస్ పులిగిల్ల విద్యార్థి వరికుప్పల ఉదయ్ చరణ్ ఉత్తమ ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికయ్యాడు. అదేవిధంగా ఫిబ్రవరి 7, 8 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

Post Midle

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. మాధవి, ఏఏపీసీ ఛైర్మన్ అమృతమ్మ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో పాల్గొని ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి పాఠశాలకే కాకుండా జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభినందించారు. విద్యార్థి విజయంలో కీలక పాత్ర పోషించిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు డా. మహేష్ బోనాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మోత్కూర్ యాదయ్య తదితరులు ఉదయ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Post bottom
Post bottom