Telugu Updates

శివాలయంలో షెడ్డు నిర్మాణానికి శ్రీకారం 

– ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఫౌండేషన్ చేయూత 

– మోక్ష లింగేశ్వర ఆలయంలో షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన 

– ఇఎల్‌వి భాస్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్

Post Midle

చౌటుప్పల్, తొలివెలుగు :  ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఇఎల్‌వి భాస్కర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ సంస్థ డైరెక్టర్ ఇరుగదిండ్ల అశోక్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో ఉన్న మోక్ష లింగేశ్వర స్వామి శివాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తుల సౌకర్యార్థం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న షెడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. ఇఎల్‌వి ఫౌండేషన్ ఆధ్యాత్మిక రంగంతో పాటు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో కూడా పేదలకు అండగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకొని దైవ కార్యాల్లో భాగస్వాములు కావాలని కోరారు. దైవ సేవల్లో పాల్గొనడం ద్వారా లభించే తృప్తి మరెక్కడా దొరకదని ఆయన పేర్కొన్నారు. అడగగానే స్పందించి షెడ్డు నిర్మాణానికి ముందుకొచ్చిన ఫౌండేషన్ ప్రతినిధులను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.

Post bottom
Post bottom