Telugu Updates

అక్రమ మద్యం పట్టివేత

– పక్కా సమాచారంతో పోలీసుల తనిఖీ
– భారీగా మద్యం బాటిళ్ల స్వాధీనం

Post Midle

వలిగొండ, తొలివెలుగు: వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వలిగొండ ఎస్ఐ యుగేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, రెడ్లరేపాక గ్రామానికి చెందిన పంతంగి వెంకటేష్ నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో తనిఖీ చేయగా, అక్కడ 81 లీటర్ల అక్రమ మద్యం బాటిళ్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 61,473 ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై దుకాణ యజమాని పంతంగి వెంకటేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

Post bottom
Post bottom