Telugu Updates

కొయ్యలగూడెంను నూతన మండల కేంద్రంగా ప్రకటించాలి

 

– అల్లాపురం మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి 

Post Midle

చౌటుప్పల్, తొలివెలుగు : చేనేత వస్త్రాలతో దేశ, ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన కొయ్యలగూడెం గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని అల్లాపురం మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ డిమాండ్‌ను వినిపించారు. చేనేత కార్మికులకు ప్రధాన నిలయంగా ఉన్న కొయ్యలగూడెం గ్రామానికి ఇప్పటివరకు సరైన ప్రాధాన్యత దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చేనేత వస్త్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ గ్రామానికి ప్రభుత్వం తగిన స్థాయిలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కొయ్యలగూడెం, దేవలమ్మ నాగారం, పీపల్ పహాడ్, అల్లాపురం, ఎనగంటి తండ, తుంబాయి తండ, రాచకొండ, ఎల్లంబావి, ఎల్లగిరి, ఖైతాపురం, ధర్మోజిగూడెం, మల్కాపురం, తుప్రాన్‌పేట మొత్తం 13 గ్రామపంచాయతీలను కలిపి నూతన మండలాన్ని ఏర్పాటు చేసి, కొయ్యలగూడెంను మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కలను కలిసి మెమోరాండం అందజేస్తామని ఆయన తెలిపారు.

Post bottom
Post bottom