Telugu Updates

కరెంటు షాక్‌తో ఇల్లు దగ్ధం

• నేరేళ్లపల్లిలో కరెంటు షాక్ ప్రమాదం

• బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం

• కుటుంబానికి అండగా ఉంటామని హామీ

• మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Post Midle

మునుగోడు/నాంపల్లి, తొలివెలుగు : నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పొగాకు నగేష్ ఇంటి వద్ద జరిగిన కరెంటు షాక్ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోయారు.

 

సంఘటన సమాచారం అందుకున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి రూ.1,50,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి గురైన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారావు, నేరేళ్లపల్లి గ్రామ సర్పంచ్ సాగర్ల యాదయ్య, ఉపసర్పంచ్ దాసరి వెంకన్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post bottom
Post bottom