Telugu Updates

విమాన ప్రమాదం: డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా ఆరుగురు మృతి

జిల్లా పరిషత్ ప్రచార కార్యక్రమానికి వెళ్తుండగా విషాదం…

 

బారామతి/డోర్నకల్, తొలివెలుగు : మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన బుధవారం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం ఆరుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ధృవీకరించింది.

ప్రమాద వివరాలు :

Post Midle

డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు కొంతమంది ఎన్‌సీపీ నేతలు, విమాన సిబ్బంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో జరుగుతున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ప్రత్యేక విమానంలో బయలుదేరగా, సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే విమానం అదుపు తప్పి కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.

ఈ ఘోర ప్రమాద వార్త రాష్ట్రం మొత్తం రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలు సంఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై డీజీసీఏ ప్రత్యేక విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post bottom
Post bottom