Telugu Updates

గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

• ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ

• ప్రమాద తీవ్రతకు రోడ్డు పక్కకు దూసుకెళ్లిన వాహనం

• ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

Post Midle

తొలివెలుగు, చిట్యాల : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొబ్బరిబోండాల లోడ్‌తో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన డీసీఎంను, విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ దిశగా వెళ్తున్న లారీ అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లగా, వాహనాలు దెబ్బతిన్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదంలో ఎవరైనా గాయపడినారా, ఎంత మేర నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Post bottom
Post bottom