Telugu Updates

సేవకురాలిగా ఉంటా.. ఆశీర్వదించండి!

3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పల్లె లావణ్య నామినేషన్ దాఖలు

చౌటుప్పల్‌, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లె లావణ్య సురేందర్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలసి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

Post Midle

నామినేషన్ అనంతరం ఆమె మాట్లాడుతూ, 3వ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవకురాలిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కార దిశగా పనిచేస్తానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని పేర్కొన్న పల్లె లావణ్య, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో  ‘హస్తం’ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. 3వ వార్డును అభివృద్ధి పథంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

Post bottom
Post bottom