Telugu Updates

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

– లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

చౌటుప్పల్, తొలివెలుగు : లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్‌ నుంచి నల్గొండకు బుల్లెట్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు.

Post Midle

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాజా పాయాజుద్దీన్ (35) శనివారం మధ్యాహ్నం తన తమ్ముడికి చెందిన బుల్లెట్ బైక్‌ (టీజీ 10 8644)పై నల్గొండకు బయలుదేరారు. మధ్యాహ్నం 1:34 గంటల సమయంలో చౌటుప్పల్ మండలం ఆరెగూడెం స్టేజి వద్దకు చేరుకున్న క్రమంలో, ముందుగా వెళ్తున్న లారీ (టీజీ 05 టీ 1015) డ్రైవర్ ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఒక్కసారిగా అతివేగంగా యూటర్న్ తీసుకున్నాడు.

ఈ క్రమంలో బుల్లెట్ బైక్ లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో పాయాజుద్దీన్ ఎడమ కాలు, చేతి వేళ్లకు తీవ్ర రక్తగాయాలు కాగా, ఛాతికి తీవ్రమైన అంతర్గత గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనపై మృతుడి తమ్ముడు మహమ్మద్ కాజా ఫహిముద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మన్మథ కుమార్ తెలిపారు.

Post bottom
Post bottom