భవానీ శంకర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
– ఈనెల 14 నుంచి 17 వరకు రెడ్లరేపాకలో మహోత్సవాలు

వలిగొండ, తొలివెలుగు : వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 17 వరకు నిర్వహించనున్న శ్రీ భవానీ శంకర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ చెవ్వ బిక్షపతి ఆధ్వర్యంలో శ్రీ భవానీ శంకర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ చెవ్వ బిక్షపతి మాట్లాడుతూ.. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు శ్రీ భవానీ శంకర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేశబోయిన బాలస్వామి, ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీసీ నోముల మల్లేష్ (శివ స్వామి), దేశబోయిన సూర్యనారాయణ, మాద శంకర్ గౌడ్, వార్డు మెంబర్ కొండం కృష్ణమూర్తి, పంతంగి కిష్టయ్య, ఖమ్మంపాటి రమేష్, కోమళ్ళ మచ్చగిరి, దేశబోయిన మల్లయ్య, పొన్నం రమేష్, గంధమల్ల పోచయ్య, సుక్క స్వామి, జువ్వగాని మధు, సాయినాథ్, శివ స్వాములు బాలరాజు, మత్స్యగిరి, నవీన్, బాబి తదితరులు పాల్గొన్నారు.
