చౌటుప్పల్లో భాజపాకు షాక్
– రెండో వార్డులో కాంగ్రెస్కు బలం
– చౌటుప్పల్లో మారిన రాజకీయ చిత్రం
– హస్తం గూటికి మట్టపల్లి యాదగిరి, నరేష్ గౌడ్

చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రెండో వార్డుకు చెందిన భాజపా అధ్యక్షుడు మట్టపల్లి యాదగిరి, పార్టీ సీనియర్ నాయకుడు సుర్వి నరేష్ గౌడ్లు ఆదివారం మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో చౌటుప్పల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ పార్టీ గెలుపుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సుర్వి ఆంజనేయులు గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, దోనకొండ కృష్ణ, గుత్తా శ్రీధర్ రెడ్డి, దోనకొండ నరసింహ, ఊదరి నరసింహ, కొసనం రాకేష్ రెడ్డి, బొంగు ప్రవీణ్ గౌడ్, సుర్వి మహేష్ గౌడ్, మట్టపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
భాజపా నుంచి కీలక నేతలు కాంగ్రెస్లో చేరడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీలో హస్తం పార్టీకి బలం చేకూరినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
