• టేక్మాల్ బస్టాండ్‌లో సర్పంచ్ సుధాకర్ చొరవ
• 45 డిగ్రీల ఎండలోనూ బాటసారులకు ఊరట

తొలివెలుగు, టేక్మాల్ : మండలంలో తీవ్ర ఎండలు మండుతున్న నేపథ్యంలో టేక్మాల్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రయాణికులకు ఊరట కలిగిస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ చొరవతో పంచాయతీ సిబ్బంది సహకారంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45°C నుండి 46°C వరకు నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బస్టాండ్‌కు వచ్చే బాటసారులు, ముఖ్యంగా చిన్నపిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులు ఈ చలివేంద్రం ద్వారా తాగునీరు పొందుతూ ఉపశమనం పొందుతున్నారు.
“ఎంత ఎండ ఉన్నా టేక్మాల్ బస్టాండ్‌కు వెళ్తే తాగడానికి మంచినీళ్లు దొరుకుతాయి” అనే నమ్మకాన్ని ఈ చలివేంద్రం కల్పించిందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కష్టాలను గుర్తించి మానవత్వంతో ఈ ఏర్పాట్లు చేసిన సర్పంచ్ సుధాకర్‌ను స్థానికులు అభినందిస్తూ ప్రశంసిస్తున్నారు.
