Telugu Updates

‘బార్’ ఎన్నికల్లో మజీద్ హాట్రిక్!


– రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మజీద్

– ప్రధాన కార్యదర్శిగా యాదాసు యాదయ్య ఎన్నిక

– ఉత్కంఠగా సాగిన న్యాయవాదుల సంఘం ఎన్నికలు

 

Post Midle

తొలివెలుగు, రామన్నపేట : రామన్నపేట బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మజీద్, ప్రధాన కార్యదర్శిగా యాదాసు యాదయ్య విజయం సాధించారు. మజీద్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికై తన పట్టును నిరూపించుకున్నారు. ఎన్నికల అధికారి యేళ్ల శ్రీశైలం గురువారం ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

నూతన కార్యవర్గం వివరాలు:

ఉపాధ్యక్షుడిగా సంగిశెట్టి బాలరాజు, సహాయ కార్యదర్శిగా దినేష్, కోశాధికారిగా కూనూరు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా శ్రవణ్ కుమార్, లేడీ రిప్రజెంటేటివ్‌గా రోసమ్మ థామస్ విజయం సాధించారు. కార్యవర్గ సభ్యులుగా పాల్వంచ జగతయ్య, సోమ సతీష్ రెడ్డి, సయ్యద్ అజిజుద్దీన్ ఎన్నికయ్యారు. న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Post bottom
Post bottom