కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కొడంగల్, తొలివెలుగు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకుని ప్రజాస్వామ్య బాధ్యతగా ఓటు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమర్థంగా పనిచేస్తున్నారని తెలిపారు.
పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండగా, అధికారులు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ముఖ్యమంత్రి ఓటు వేయడంతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
