– భోజన సౌకర్యాలను పరిశీలించిన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

చౌటుప్పల్, తొలివెలుగు : ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న సేవలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ కోరారు. శనివారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆయన ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారులకు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తోందని, దీనిని లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కేంద్రానికి హాజరవుతున్న గర్భిణీలు, చిన్నారుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాచకొండ భార్గవ్, గునుగంటి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త పారిజాత తదితరులు పాల్గొన్నారు.
