Telugu Updates

ఎస్.లింగోటంలో రైతు ఆకస్మిక మృతి

– మేడారం వెళ్లిన కుటుంబ సభ్యులు..

– ఇంట్లోనే విగతజీవిగా భర్త..

Post Midle

చౌటుప్పల్, (తొలివెలుగు): చౌటుప్పల్ మండలం, ఎస్.లింగోటం గ్రామంలో చింతపల్లి అంజిరెడ్డి (57), అనే రైతు అనారోగ్యంతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజిరెడ్డి భార్య స్వర్ణలత, కుటుంబ సభ్యులు ఈనెల 16న మేడారం జాతరకు వెళ్లారు. అంజిరెడ్డి గత కొంతకాలంగా బిపి, షుగర్ వ్యాధులతో బాధపడుతుండటంతో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున పాలు పోయడం కోసం వచ్చిన బంధువు భూపాల్ రెడ్డి.. ఇంట్లో లైట్లు వేసి ఉండటం గమనించి లోపలికి వెళ్లి చూడగా, అంజిరెడ్డి బెడ్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. అజయ్ భార్గవ్ తెలిపారు.

Post bottom
Post bottom