Telugu Updates

మల్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– గుర్తుతెలియని లారీ ఢీకొని మహిళ దుర్మరణం

– దైవ దర్శనం చేసుకుని వస్తుండగా విషాదం.. భర్త, కుమార్తెకు గాయాలు

Post Midle

చౌటుప్పల్, (తొలివెలుగు): జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గుర్రంగూడకు చెందిన పుట్టగళ్ల విక్రం తన భార్య దుర్గ (28), కుమార్తె జాన్‌శ్రీతో కలిసి శనివారం చెరువుగట్టు దర్శనానికి వెళ్లారు. ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో తమ యాక్టివాపై తిరిగి వస్తుండగా, చౌటుప్పల్ మండలం మల్కాపురం ఆందోళ్ మైసమ్మ గుడి సమీపంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక గుర్తుతెలియని లారీ వెనుక నుండి అతివేగంగా వచ్చి వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన దుర్గ తలపై నుండి లారీ చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. విక్రంతో పాటు నాలుగేళ్ల కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనపై ఎస్ఐ ఉపేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Post bottom
Post bottom