– 20వ వార్డు నుంచి పోటీకి ఆసక్తి

చౌటుప్పల్, తొలివెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో చౌటుప్పల్ 20వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఎన్ఎస్యూఐ నాయకుడు పోతగాని శివ గౌడ్ కోరారు. సోమవారం లక్కారంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి ఈ మేరకు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా శివ గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయాలని, తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆవుల రాజు యాదవ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
