కేసీఆర్పై సిట్ విచారణ.. రాజకీయ కక్షే!
– వలిగొండలో బీఆర్ఎస్ ధర్నా
– ప్రభుత్వ వైఖరిపై నేతల నిప్పులు
– అక్రమ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన ధర్నా

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కక్షపూరిత చర్యేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు, రాష్ట్ర నాయకుడు పైళ్ళ శేఖర్ రెడ్డి పిలుపునిచ్చిన మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వలిగొండ పట్టణ కేంద్రంలో కేసీఆర్పై అక్రమ సిట్ విచారణకు నిరసనగా శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు. పరిపాలన చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతో కేసీఆర్పై అక్రమ సిట్ విచారణకు పిలవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ కేసీఆర్పై నిందలు మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కక్షపూరిత చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైళ్ళ రాజవర్ధన్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్, మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పల్సం రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు ఎండి అప్రోచ్, నాయకులు ఎలిమినేటి జంగారెడ్డి, కొమురెల్లి సంజీవరెడ్డి, కీసర్ల సత్తిరెడ్డి, కొండూరు వెంకటేశం గౌడ్, ఐటీ పాముల ప్రభాకర్, సర్పంచులు రాపోలు గోపి, బుడిగె లింగస్వామి, ఆవుల నరసింహ, జడిగే బిక్షపతి, తిరుమలేష్, సోషల్ మీడియా అధ్యక్షుడు కూచిమల్ల సుధాకర్, పబ్బు వెంకటరమణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎడవెల్లి శాంతి కుమార్, బలుగూరు నరేష్ రెడ్డి, పోలపాక సత్యనారాయణ, అసిరెడ్డి జనార్దన్ రెడ్డి, గంగారం రమేష్, కాసుల పెద్దలు పబ్బు స్వామి, మల్లం నరేష్, నాగిళ్ల యాదగిరి, కూచుమల్ల నాగేష్, కడివేరి యాదగిరి, మొగిలిపాక రమేష్, చెవ్వ వెంకటేశం, శంకర్ రెడ్డి, పబ్బు బాలకృష్ణ, నీలం నరేందర్తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
