Telugu Updates

బక్రీద్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్

తొలివెలుగు, చౌటుప్పల్: బక్రీద్ పండుగ నేపథ్యంలో మేకలు, గొర్రెల దొంగతనాలు జరిగే అవకాశమున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Post Midle

పండుగ సమయాన్ని ఆసరాగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కార్లు లేదా ఇతర వాహనాల్లో గ్రామాలకు వచ్చి మేకలు, గొర్రెలను దొంగిలించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు, వాహనాలు కనిపించిన వెంటనే స్థానికులు అప్రమత్తమై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

గ్రామస్తులు పరస్పర సహకారంతో అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను అరికట్టవచ్చని, ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలను కాపాడగలమని పోలీసులు పేర్కొన్నారు.

Post bottom
Post bottom