Telugu Updates

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి సీనియర్ నేతల చేరిక

– చౌటుప్పల్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా?

చౌటుప్పల్, తొలివెలుగు :  చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చింతల ఉమా మహేశ్వరీ, సాయిలు ఆదివారం కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకొని పార్టీలోకి అధికారికంగా అడుగుపెట్టారు.

Post Midle

ఈ సందర్భంగా నూతనంగా బీఆర్ఎస్‌లో చేరిన నేతలు మాట్లాడుతూ.. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు స్పష్టమైన దిశ, దృఢమైన విధానం ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ జెండానే ఎగిరేలా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్ వైపు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఆకర్షితులవుతున్నారని అన్నారు. చౌటుప్పల్‌లో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన నేతలను ఘనంగా స్వాగతించారు.

Post bottom
Post bottom