కుక్కలు కరిస్తేనే కాదు.. నాకినా డేంజరే?
తొలివెలుగు, జాతీయ న్యూస్ :- ఈ రోజుల్లో చాలా మంది కుక్కలను పెంచుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కానీ అవి వాళ్ళ ప్రాణాలు మీదకు తీసుకువస్తాయని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఇక తాజాగా జరిగిన ఒక ఘటన అయితే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విధంగా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే యూకేకు చెందిన మంజీతా అనే 56 సంవత్సరాల మహిళ తన పెంపుడు కుక్క శరీరాన్ని నాకడం వల్ల ఆమె చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు.

రేబిస్ సోకినటువంటి కుక్కలు కరిస్తేనే మనకి రేబిస్ వ్యాధి వస్తుంది అంటే అది పొరపాటే అని చెప్పవచ్చు. ఈ మహిళకు రేబిస్ సోకిన కుక్క నాకడం వల్ల దాదాపు ఆసుపత్రిలో 32 వారాలపాటు చికిత్స పొంది ఎన్నోసార్లు గుండెపోటులను ఎదుర్కొని చివరికి కాళ్లు, చేతులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆమె కాళ్లు, చేతులు లేకుండా చావు బతుకుల మధ్య పోరాడి చివరికి ఇంటికి చేరుకున్నారు. కేవలం ఈమె కాలికి ఉన్నటువంటి ఒక గాయాన్ని ఆ కుక్క నాకడంతో ఆ వ్యాధి వచ్చి ఉండవచ్చు అని వైద్యులు భావిస్తున్నారు. ఎలాంటి కుక్కలు అయినా సరే ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని.. ఇలాంటి వ్యాధులు అరుదైనప్పటికీ కూడా దురదృష్టం ఉంటే అది మీకే సోకచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
