ఆ యుద్ధాన్ని నేను ఆపకుంటే ఈపాటికి పాక్ ప్రధాని చనిపోయేవారు : ట్రంప్
తొలివెలుగు, అంతర్జాతీయం :- ప్రతిరోజు ఏదో ఒక వార్తతో ప్రపంచవ్యాప్తంగా వార్తలలో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశి మరో మారు వార్తల్లో నిలిచారు. ఈరోజు నావల్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి బతికి ఉన్నాడు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోజు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నేను ఆపకపోతే ఆ యుద్ధంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి చనిపోయే వారిని ఇప్పటికకీ నాతో చాలామంది చెప్తున్నారు అని డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా ఆరోజు ఇరు దేశాల మధ్య నేను జోక్యం చేసుకోకపోతే అణు యుద్ధం జరిగుండేది అని మరోసారి భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ వాతావరణన్ని గుర్తు చేసుకున్నారు.

కేవలం 10 నెలల కాలంలోనే 8 యుద్ధాలను ఆపాను అని మరోసారి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్తతో ప్రపంచం మొత్తాన్ని కూడా నిద్ర లేపుతూనే ఉన్నారు. తను మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ప్రతి దేశాన్ని కూడా చేరుతున్నాయి. ఒకసారి అందరికీ అనుకూలంగా.. మరోసారి ప్రతి ఒక్కరికి విరుద్ధంగా ట్రంపు సంభాషించడం అనేది ప్రతి ఒక్కరిలోనూ కాస్త ఆందోళనగా మారింది. మరోవైపు టారిఫ్స్ తో ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
