హైదరాబాదులో శరవేగంగా కల్కి-2 షూటింగ్
తొలివెలుగు,సినిమా:- నాగ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చినటువంటి కల్కి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరుణంలోనే తాజాగా ఈ సినిమా పార్ట్ -2 షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. కల్కి 2898 AD సిక్వెల్ లో భాగంగా కల్కి -2 షూటింగ్ హైదరాబాదులో చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తి అవ్వగా త్వరలోనే మిగతా సినిమా షూటింగ్ సెట్ లో ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అని చిత్ర బృందం తెలిపింది.
ఈ సినిమా షూటింగ్ సెట్ లో భాగంగా తాజాగా దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. సెట్ లో వీరిద్దరూ కలుసుకోగానే ఆలింగనం చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఎంత వీలైతే అంత త్వరగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ సినిమా ఎంత వీలైతే అంత త్వరగా విడుదల చేస్తే అంత పెద్ద హిట్ అందజేస్తాము అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మధ్య మారుతి డైరెక్షన్ లో వచ్చిన రాజా సాబ్ పట్ల డార్లింగ్ ప్రభాస్ అభిమానులు సైతం తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే. దీంతో తర్వాత విడుదల కాబోయేటువంటి ప్రభాస్ సినిమాలపై ఫ్యాన్స్ ఎంతగానో హోప్స్ పెట్టుకున్నారు.
