Telugu Updates

మొదలైన పెళ్లి వేడుకలు.. నేడు మెహందీ ఫంక్షన్

తొలివెలుగు, సినిమా న్యూస్ :- టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. వీళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వీళ్లకు ఉన్నటువంటి అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈనెల 26వ తేదీన వీరిద్దరి పెళ్లి అతి కొద్దిమంది బంధువుల మధ్యనే జరుగుతుంది అని కన్ఫామ్ అయ్యింది.  రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లి సందడిలో భాగంగా ఈరోజు మెహందీ ఫంక్షన్ ఘనంగా జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు అలాగే వారి బంధువులు వీరిద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ  రాజస్థాన్లోని ఉదయపూర్ కు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Post Midle

ఈ పెళ్లి వేడుకలో భాగంగా ఈరోజు మెహందీ రేపు హల్దీ మరియు సంగీత్ నిర్వహించనున్నారు. ఇక ఎల్లుండి హిందూ సాంప్రదాయ ప్రకారం వీరిద్దరికీ ఘనంగా వివాహం జరగనుంది అని సమాచారం. పెళ్లి మాత్రం అత్యంత రహస్యంగా జరుగుతున్నట్లు.. అలాగే ఈ వేడుకకు కేవలం 100 మంది అతిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ చేయనున్నట్లు.. ఈ రిసెప్షన్లో భాగంగా ప్రముఖ హీరోలను అలాగే రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. 

Post bottom
Post bottom