దురంధర్-2 ప్రతి భారతీయుడు చూడాలి : సూపర్ స్టార్ రజనీకాంత్
తొలివెలుగు,సినిమా న్యూస్ :- ఉగాది పండుగ కానుకగా విడుదలైనటువంటి దురందర్ -2 సినిమా ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా ఏకంగా భారతదేశ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతుంది. ఈ సినిమా మొదటి భాగం 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టిస్తే దీని రెండవ భాగం అతి తక్కువ సమయంలోనే 1000 కోట్లు దాటుతుంది అనే సందేహం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే స్టార్ హీరోలు స్పందిస్తూ ప్రశంసలు కురిపించగా తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. దురంధర్ 2 అనే సినిమా ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాలి అని కోరారు.

ఈ సినిమా డైరెక్టర్ ఆదిత్యధర్ “బాక్స్ ఆఫీస్ కా బాప్” అంటూ కొనియాడారు. కాగా ఈ సినిమా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఈ మూవీ గ్రాస్ 619.76 కోట్లు ఉండగా గ్లోబల్ కలెక్షన్లలో గ్రాస్ 829.76 కోట్లకు చేరినట్లు sacnilk తెలిపింది. ఈ కలెక్షన్లు ఇలానే కొనసాగితే మరో రెండు లేదా మూడు రోజుల్లో సులభంగా 1000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని సినీవర్గాలు అంచినా వేసాయి.
