Telugu Updates

అదంతా అబద్ధం.. గోలీల ఫ్యాక్టరీ పై తొలిసారి స్పందించిన హీరో

తొలివెలుగు,సినిమా:- ​సోషల్ మీడియాలో ఇటీవల ఒక వింత వార్త తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరో రాజశేఖర్‌కు ఒక ‘గోళీల (మార్బుల్స్) ఫ్యాక్టరీ’ ఉందని, అక్కడ పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని ఆ వీడియోల సారాంశం. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తాజాగా హీరో రాజశేఖర్ స్పష్టం చేశారు.

నిజానిజాలు ఇవే…
​తొలిసారి స్పందన: తనపై వస్తున్న ఈ వింత ప్రచారంపై రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తనకు ఎటువంటి గోళీల ఫ్యాక్టరీ లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఎలా తెలిసింది?.. ఈ ఫ్యాక్టరీ వార్తలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూసిన తన సన్నిహితులు, స్వయంగా తనకు ఫోన్ చేసి అడగడంతోనే అసలు విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Post Midle

కుటుంబం రియాక్షన్… ఈ వార్త విన్నప్పుడు తనతో పాటు తన భార్య జీవిత రాజశేఖర్ కూడా ఆశ్చర్యపోయారని, అసలు సంబంధం లేని విషయం కావడంతో తామంతా నవ్వుకున్నామని ఆయన తెలిపారు.

Post bottom
Post bottom