యుద్ధ ప్రభావం.. ఏయే ధరలు పెరిగాయో మీకు తెలుసా?
తొలివెలుగు,జాతీయ న్యూస్ :- పశ్చిమాసియాలో యుద్ధం యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మిగతా దేశాలు ఎందులో నష్టపోతున్నాయో తెలియదు కానీ భారతదేశంలోని కొన్ని వస్తువులకు మాత్రం డిమాండ్ పెరుగుతుంది. ఈ ఇరాన్ – అమెరికా,ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మన భారతదేశంలో వంట గ్యాస్ తో పాటు వంట నూనెల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారంలో ప్రతి నూనెపై ఒకటి నుంచి ఐదు రూపాయలు వరకు ధరలు పెరిగాయి.

ప్రస్తుతం సన్ఫ్లవర్ ఆయిల్ 4 రూపాయలు, పామ్ ఆయిల్ 3 రూపాయలు, గ్రౌండ్నట్ ఆయిల్ 2 రూపాయలు, సోయాబీన్ వనస్పతి ఆయిల్ పై 1 చొప్పున పెరిగాయి. మన భారతదేశంలో ఉపయోగించే వెజిటేబుల్ ఆయిల్ లో దాదాపు 90% అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కనుక ఈ ధరలు ఇంతకు మించి పెరిగాయి. మరోవైపు ఇంధన ధరలు, వంట గ్యాస్ ధరలు మరికొద్ది రోజుల్లో మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉండడంతో ఇప్పటినుంచే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి కొంతమంది ముందు రోజులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే గ్యాస్ నిలవలను అలాగే పెట్రోల్ మరియు డీజిల్ వంటివి ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసుకుని భద్రపరుచుకుంటున్నారు.
