Telugu Updates

తప్పయింది.. క్షమించు అక్షర్ బాయ్!

తొలివెలుగు,స్పోర్ట్స్ :- ఈమధ్య హోరాహోరీగా జరిగినటువంటి టి20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకున్న తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆ జట్టులోని ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కు క్షమాపణలు చెప్పారు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ -8 లో సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో అక్షర్ పటేల్ ఆడని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే.

అయితే ఈ ఘటన తరువాత జట్టులో తీసుకోకపోవడం పై అక్షర పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు అని.. అక్షర్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఎటువంటి తప్పు లేదు అని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అక్షర పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను సెలెక్ట్ చేశారు. కానీ ఆరోజు అక్షర పటేల్ లేని లోటు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది అని.. ఏది ఏమైనా కూడా ఆ రోజు తనని తీసుకోకపోవడం తప్పే అని సూర్యకుమార్ యాదవ్ తాజాగా అక్షర పటేల్ కు సారీ చెప్పుకొచ్చారు. దీంతో తప్పును నిర్భయంగా ఒప్పుకున్న సూర్య కుమార్ యాదవ్ పై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందరూ ఉన్నాయి.

Post Midle
Post bottom
Post bottom