Telugu Updates

ఫ్యాన్స్ నిరాశలో ఉంటే నీ జల్సాలేంటి హార్దిక్ భయ్యా?

తొలివెలుగు,స్పోర్ట్స్ న్యూస్ :-   భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య సూపర్ -8 లో భాగంగా జరిగినటువంటి మొదటి మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పొందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.  ఆ తరువాత ప్రతి ఒక్క అభిమాని కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో రోడ్లమీదరోడ్ల మీద ఇష్టానుసారంగా  జల్సాలు చేస్తూ తిరుగుతున్న ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ వీడియోలను చూసి హార్దిక్ పాండ్యా పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ప్రపంచ కప్ వంటి టోర్నీలో అది కూడా సెమీస్కు చేరాల్సిన టైంలో ఘోరపరాజయం పొంది ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశలో ఉంటే నువ్వు మాత్రం గర్ల్ ఫ్రెండ్ తో బయట తిరుగుతూ జల్సాలు చేస్తున్నావా అంటూ హార్దిక్ పాండ్యా పై విపరీతంగా ఫైర్ అవుతున్నారు.

Post Midle

ఆటపై దృష్టి పెట్టకుండా గర్ల్ ఫ్రెండ్ తో చెట్టపట్టా లేసుకుని తిరుగుతున్నావు ఏంటి అని మండి పడుతున్నారు. జట్టులోని ప్రతి ఒక్కరు కూడా ఆటపై బాధ్యత వహించాలి అని.. గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి తర్వాత ఎంతో సమయం ఎన్నో సందర్భాలు ఉంటాయని సూచిస్తున్నారు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సైతం తన భార్యతో కలిసి బయట తిరగడంపై ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది ఈ వరల్డ్ కప్ లో భారత్ గెలవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో మీరు ఆటపై కాకుండా ఎంజాయ్ పై దృష్టి పెట్టడం సరికాదు అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ ఈ వరల్డ్ కప్ లో భారత్ కనీసం సెమి ఫైనల్ కు కూడా చేరకపోతే ఫ్యాన్స్ నుంచి తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Post bottom
Post bottom