Telugu Updates

ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

– పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన మహనీయుడు: సుంకరి జంగయ్య గౌడ్

చౌటుప్పల్, (తొలివెలుగు): తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని చౌటుప్పల్ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ అధ్యక్షుడు సుంకరి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జంగయ్య గౌడ్ మాట్లాడుతూ.. 1983లో పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి, సామాన్యుడికి ఇబ్బందిగా ఉన్న పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు మండల వ్యవస్థను తీసుకువచ్చిన సంస్కర్త ఆయనేనని కొనియాడారు. సినిమా, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర అజరామరమని పేర్కొన్నారు. రాబోయే మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Post Midle

కార్యక్రమంలో నల్ల పర్వతాలు ఉపాధ్యక్షుడు మారగోని అశోక్ గౌడ్, ఉపాధ్యక్షుడు వర్కాల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గుమ్మడి అంజిరెడ్డి, తడక కోటేశ్వర్, బొంగు బాదుషా గౌడ్, పోలోజు గోవిందా చారి, గోసుకొండ వెంకటేష్, యు. శ్రీను గౌడ్, చిట్కా అశోక్ గౌడ్, బోదుల గణేష్, ఉపేందర్ చారి, అంతటి కృష్ణయ్య, సిగ్గిరెడ్డి సురేందర్ రెడ్డి, బిగ్గీ మహేష్, శివగోని రమేష్ గౌడ్, చిన్నం కృష్ణ, గుర్రం నరసింహ, గుర్రం కృష్ణ, ముమ్మడి లింగాచారి, బొడ్డు రాందాసు, ప్రచార కార్యదర్శి కృష్ణ తేజ, యాట వెంకటేష్, కొండూరు నరసింహ, ముత్యాల పాపిరెడ్డి, కందకట్ల రామకృష్ణ, తీగుల ఐలయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post bottom
Post bottom