– చౌటుప్పల్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
చౌటుప్పల్, (తొలివెలుగు): మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం చౌటుప్పల్‌లో ఘనంగా జరిగాయి. ‘టీమ్ పీఆర్‌జీ’ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని అమ్మానాన్న అనాథాశ్రమంలో అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రాజు గౌడ్ నిరంతరం ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికి, క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, మున్సిపాలిటీ నాయకులు మోగుదాల రమేష్ గౌడ్, బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్, చెరుకు లింగస్వామి గౌడ్, రావుల స్వామి, కంచరకుంట్ల రాంరెడ్డి, చెవగోని వెంకటేష్ గౌడ్, సందగళ్ళ సతీష్ గౌడ్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

