⇒ అసెంబ్లీలో సీఎం ఫైరింగ్ వ్యాఖ్యలు
⇒ నాటకాలు ఆపితే ఆ దేవుడు క్షమిస్తాడు
తొలివెలుగు,ఆంధ్రప్రదేశ్:- ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తిరుమల లడ్డు కల్తీ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు అధికారం మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు మధ్య ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీశారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతోమంది హిందువుల మనోభావాలు ఈ ఘటనతో దెబ్బతిన్నాయి అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ లడ్డు కల్తీ వ్యవహారంపై కీలక చర్చలు జరిగాయి.

తిరుమలలో లడ్డు కల్తీ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ నేను రాజకీయాలలో ఉన్నాను కాబట్టి ఏ దేవాలయానికి కూడా పాలు లేదా నెయ్యి సరఫరా చేయకూడదు అని నిర్ణయించుకున్నాను అని అన్నారు. అలాగే వైసీపీ పార్టీపై కూడా అసెంబ్లీ వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు విషయంలో తప్పు చేసింది కాక.. మళ్ళీ హెరిటేజ్ ను తీసుకువచ్చి తప్పు దోవ పట్టిస్తున్నారు అని మండిపడ్డారు. ఇందాపూర్ తో హెరిటేజ్ కు ఎటువంటి సంబంధం లేదు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మీరు చేసిన తప్పులను ప్రజలు గుర్తుంచుకుంటారు అని.. ఇకనైనా నాటకాలు ఆపండి అని వైసీపీ పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
