⇒ ఏపీలో కల్తీపాల ఘటన సంచలనం
⇒ ఆరుకు చేరిన మృతుల సంఖ్య
⇒రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా
తొలివెలుగు,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో కల్తీపాల ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనలో మొన్నటి వరకు నలుగురు వ్యక్తులు చనిపోగా నేడు ఈ ఘటనలో భాగంగా మృతుల సంఖ్య 6 కు చేరింది. ఇక తాజాగా విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆరేళ్ల బాలుడు మరణించారు అని వైద్యులు తెలిపారు. దీంతో ఈ కల్తీ పాల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇదిలా ఉండగా మరొక ఏడు మంది పరిస్థితి పూర్తి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పందిస్తూ ఈ ఘటనలో మృతి చెందిన వారికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే ఈ కల్తీ పాల ఘటనలో ఎవరైతే నిందితులు ఉంటారో వారిని కఠినంగా శిక్షించాలి అని తెలిపారు . ప్రస్తుతం ఈ కల్తీ పాల ఘటనలోని బాధితుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటుంది అని వారికి కావలసినటువంటి మెరుగైన మెడిసిన్స్ ను కూడా అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండ్యన్ తెలిపారు. ఈ విషయంపై మరింత సమాచారం త్వరలోనే మీ తొలివెలుగు లో…
